»Up Government Good News For Students 25 Thousand Health Coverage
Lucknow : విద్యార్ధులకు యూపీ సర్కారు గుడ్ న్యూస్…25వేలహెల్త్ కవరేజీ
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సర్కారు విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. లక్నో (Lucknow) మున్సిపాలిటీలో విద్యార్థులకు రూ.25వేల చొప్పున హెల్త్ కవరేజీని అందిస్తున్నారు. లక్నో స్మార్ట్ సిటీ (Smart city) లక్నో ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొన్ని కళాశాలలు, స్కూళ్లలో చదివే 2,000 మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ (Health checkup) చేయనున్నారు. వారికి రూ.25వేల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) కార్డులను కూడా ఇవ్వనున్నారు. పట్టణంలోని అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు చేయాలని లక్నో స్మార్ట్ సిటీ పాలకవర్గం నిర్ణయించింది.

ఇందుకు రూ.25 లక్షల బడ్జెట్ ను కూడా కేటాయించింది. బడిలో డ్రాపవుట్స్ పెద్ద సమస్యగా ఉంది . విద్యార్థులు (students) చదువుకునే స్థోమత లేక మానేస్తుంటారు. అందుకే దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం (Meals )లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇక విద్యార్థులకు వైద్య పరమైన సమస్యలు ఎదురైతే..? సర్కారు దవాఖానాకు (hospital) బదులు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యానికి వీలుగా ఉచిత బీమా సదుపాయం ఉంటే..? అది విద్యార్థుల భద్రతకు భరోసానిస్తుంది. అందుకే లక్నో మున్సిపాలిటీలో విద్యార్థులకు రూ.25వేల చొప్పున హెల్త్ కవరేజీని అందిస్తున్నారు.