ఖమ్మంలోని పాలేరు(Paleru) ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM) పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. పాలేరు సీటు సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని ఇటీవల అన్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(tummala nageswara rao), సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పార్థసారధి రెడ్డి(kandala pardha saradhi reddy) సైతం తమకే టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్ల కోసం చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో బీఆర్ఎస్(BRS) నాయకత్వానికి ఈ టిక్కెట్లు సమస్య తలనొప్పిగా తయారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఖమ్మం జిల్లాలో పాలేరు(Paleru) సీటు కోసం అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ, సీపీఎం(CPM) మధ్య తామంటే తాము పోటీ చేస్తామని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో పర్యటించిన కేసీఆర్ పర్యటనలో సైతం సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలు హాజరయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు.
ఈ క్రమంలో పాలేరులో నిర్వహించిన సీపీఎం జన చైతన్య యాత్రకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. మరోవైపు కుసుమంచిలో జరిగిన కార్యక్రమంలో కందాల సమక్షంలో తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణలో పాలేరు(Paleru) టిక్కెట్(Ticket) కీలకమని పేర్కొన్నారు. ఈ స్థానాన్ని సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని అన్నారు. ఈ నేపథ్యంలో పాలేరు సీటుపై ఒక్కక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ నియోజకవర్గం టిక్కెట్ గురించి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పార్థసారధి రెడ్డి(kandala pardha saradhi reddy) మళ్లీ నామినేషన్‌పై ఆశతో ఉన్నారు. అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం(tummala nageswara rao) పాలేరుపై కన్నేశారు. తనను తాను పక్కన పెట్టడం పట్ల అసంతృప్తిగా ఉన్నందున, ఇటీవల ఆర్థిక మంత్రి టి హరీష్ రావు(harish rao) అతని నివాసంలో ఆయనను కలుసుకుని, అతని భావాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. పాలేరులో ఈసారి పార్టీ టిక్కెట్ తనకే దక్కుతుందన్న భావనలో నాగేశ్వరరావు ఉన్నారు.
మరోవైపు పాలేరు నుంచి పోటీచేస్తానని తెలంగాణ వైస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila) సైతం స్పష్టం చేశారు. కమ్యునిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయాని..వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.