»On One Side Kcr Speech On The Other Side Brs Leaders Fight At Lb Nagar
Lb Nagar: ఓ వైపు కేటీఆర్ ప్రసంగం..మరోవైపు బీఆర్ఎస్ నేతల లొల్లి
హైదరాబాద్ ఎల్బీనగర్(LB Nagar)లో నిన్న మంత్రి కేటీఆర్(KTR) సమక్షంలోనే బీఆర్ఎస్ నేతల(BRS leaders) మధ్య వాగ్వాదం బయటపడింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మధ్య గొడవ చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అనుచరులు రమణారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని నియంత్రించారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్(LB nagar)లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ వైపు మంత్రి కేటీఆర్(KTR) ప్రసంగిస్తున్నారు. కానీ అదే క్రమంలో బీఆర్ఎస్(BRS) నేతల్లో వర్గపోరు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు రమణారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆ క్రమంలో గమనించిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. పోలీసుల పుణ్యమా అని అతను అక్కడి నుంచి తప్పించుకున్నారు.
శనివారం సాయంత్రం ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్(BRS) నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్(LB nagar) ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్చార్జి రామ్మోహన్‌గౌడ్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో చంపాపేట్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డిని ఎమ్మెల్యే వేదికపై నుంచి దించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గొడవ మొదలైనట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగానే నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులు అతనిపై దాడికి యత్నించగా, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి అక్కడి నుంచి పారిపోయారు.
వనస్థలిపురం నుంచి దిల్ సుఖ్ నగర్ రహదారిపై ఈ కొత్త ఎల్బీ నగర్ వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి రాకపోకలు తగ్గనున్నాయి. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనను రూ.32 కోట్లతో మూడు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ SSRDP యొక్క 19వ ప్రాజెక్ట్‌గా నిర్మించబడింది. దీంతో ఏపీ నుంచి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్ నగర్లో ఎవరైనా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.