»Cheetah In Tirumala Ghat Road Frightened Devotees March 26th 2023
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత..భయాందోళనలో భక్తులు
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ఓ చిరుత(leopard) సంచరిస్తోంది. గాలిగోపురం పరిధిలోని మొదటి ఘాట్ రోడ్ 35వ మలుపు వద్ద చెట్ల పొదల్లో చిరుత(Cheetah) కనిపించినట్లు భక్తులు(Devotees) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
నిత్యం భక్తుల రద్దీతో ఉండే తిరుమలకు భక్తులు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ఓ చిరుత(leopard) సంచరిస్తోంది. గాలిగోపురం పరిధిలోని మొదటి ఘాట్ రోడ్ 35వ మలుపు వద్ద చెట్ల పొదల్లో చిరుత(Cheetah) కనిపించినట్లు భక్తులు(Devotees) చెబుతున్నారు. ఓ చెట్టు కింద సేద తీరుతున్న చిరుత(leopard) చిత్రాన్ని ఫోటో తీసి ఈ మేరకు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ప్రయాణించాలంటే వాహనదారులు సైతం భయపడుతున్నారు.
మరోవైపు గతంలో కూడా అనేకసార్లు చిరుతలు భక్తులకు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ చిరుత నీరు(water) తాగేందుకు వచ్చిందని పలువురు అంటున్నారు. ఆ క్రమంలో అధికారులకు సమాచారం తెలుపడంతో వారు వచ్చి చిరుతను అడవిలోకి పంపించేందుకు ప్రయత్నించారు.
అంతేకాదు రెండేళ్ల క్రితం చిరుత అదే ప్రాంతంలో ఇద్దరు చిన్నారులపై(children) కూడా దాడి చేసింది. ఆ తర్వాత పాదచారుల మార్గంలో కూడా సంచరించింది. కానీ ఆ క్రమంలో అదృష్టవశాత్తూ భక్తులు(Devotees) లేకపోవడంతో ఎవరికి ఏమి జరుగలేదు. అయితే 250 కంటే ఎక్కువ జింకలు ఉన్న పార్కులో చిరుత జాడలను కూడా అధికారులు(officers) గుర్తించారు. ఆ తర్వాత అవి బయటికి వస్తున్నాయని..సమీప ప్రాంతాల్లో ట్రాప్లను ఏర్పాటు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. కానీ అవి మళ్లీ తాజాగా సంచరించడం పట్ల భక్తులు టెంన్షన్ పడుతున్నారు.