»Bad News For The City Dwellers Mango Prices Will Increase
Mango Prices: నగర వాసులకు బ్యాడ్ న్యూస్..పెరగనున్న మామిడి ధరలు!
అడపాదడపా కురుస్తున్న వర్షాల(rains) కారణంగా వేసవి తాపం నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మామిడి ప్రియులకు(mango lovers) మాత్రం ఇది చేదువార్త అని చెప్పవచ్చు. అకాల వర్షాలు సహా చీడ పీడల కారణంగా మామిడి పండ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మామిడి పండ్ల సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు(prices) ఎక్కువగా ఉంటాయని, వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల వాసుల మామిడి(mango) ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మామిడి పండ్ల ధరలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు(rains) సహా చీడపీడల కారణంగా మామిడి పండ్లు రాలిపోతున్నట్లు రైతులు(farmers) చెబుతున్నారు. ఈ క్రమంలో తర్వాత రోజుల్లో ఉత్పత్తి తగ్గిపోయి మామిడి పండ్ల ధరలు(mango prices) పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే పసుపు పండు 20 నుంచి 30 శాతం తగ్గుతుందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి.
ఉద్యానవన శాఖ ప్రకారం, నవంబరు నెలలో మామిడి పంట పుష్పించే దశలో, అకాల వర్షాల వల్ల మామిడి పంటలు దెబ్బతిన్నాయి. తెగుళ్లు (బ్లాక్ త్రిప్స్) కారణంగా పంట దిగుబడి పడిపోయింది. మరొక కారణం ఏమిటంటే, ఫలాలు కాసిన తర్వాత ఆకస్మిక వర్షాలు, వడగళ్ల వానల కారణంగా చాలా పండ్లు దెబ్బతింటున్నాయని రైతులు(farmers) చెబుతున్నారు. ఆ తర్వాత ధరలు(prices) పెరగడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.
గతేడాదితో పోల్చితే మార్కెట్‌కి(market) మామిడికాయలు కొంచెం ముందుగానే వచ్చాయి. కానీ పరిమాణం చాలా తక్కువగా ఉంది. ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నగరంలో మామిడి పండ్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సాధారణ మామిడి పండ్లను ప్రస్తుతం కిలో రూ.180కి విక్రయిస్తున్నారు. గతేడాది రూ.100గా ఉండేది. హిమాయత్ మామిడితో సహా ఇతర రకాల మామిడి పండ్లను కిలో రూ.250కి విక్రయిస్తుండగా, బేనిషాన్-బనగానపల్లె కిలో రూ.180కి విక్రయిస్తున్నారు. కేసర్‌ను కిలో రూ.250కి విక్రయిస్తున్నట్లు గుడిమల్కాపూర్ మార్కెట్ డీలర్ తెలిపారు. ఈ క్రమంలో హోల్‌సేల్ మార్కెట్ నుంచి తాము అధిక ధరలకు మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు రవాణా ఛార్జీలను కూడా భరించవలసి ఉంటుందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని వెల్లడించారు.