»Jagan Said In The Past Chandrababu Misled Women Not To Pay The Dwcra Loans Eluru District
Jagan: బాబు గతంలో రుణాలు కట్టొద్దని మహిళలను తప్పుదొవ పట్టించారు
ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్(ap cm jagan) బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు (chandrababu naidu)మాత్రం మహిళలకు డ్వాక్రా రుణాలు(dwcra loans) కట్టవద్దని తప్పుదొవ పట్టించారని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్(YSR) ఆసరా పథకం మూడో విడత నిధులను ఈరోజు(మార్చి 25న) విడుదల చేసింది. డ్వాక్రా మహిళలకు స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(ys jagan mohan reddy) ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో బటన్ను నొక్కి నిధులను విడుదల చేశారు. దీని ద్వారా… ప్రభుత్వం రూ.78.94 లక్షల మహిళా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో 6,419.89 కోట్లు జమ చేసింది. తద్వారా డ్వాక్రా మహిళలకు ఊరట లభించనుంది. ఈ సొమ్మును డ్వాక్రా మహిళలు దేనికైనా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యారు. గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు(chandrababu naidu) మహిళలను డ్వాక్రా రుణాలను(dwcra loans) కట్టొద్దని చెప్పి తప్పుదొవ పట్టించారని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు హాయాంలో 14 వేల కోట్ల రూపాయలు ఇవ్వగా..ప్రస్తుతం 30 వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని జగన్ అన్నారు. 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు తీసేశారని జగన్ అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు సైతం తీరుస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని చెప్పారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీలను సైతం తగ్గించినట్లు తెలిపారు.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొదుపు సంఘాల మహిళల రుణాన్ని(dwcra loans) ప్రభుత్వం తీరుస్తుందని సీఎం జగన్(jagan) హామీ ఇచ్చారు. ఆ విధంగా నిధులు విడుదల చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఈ రుణాన్ని 4 విడతల్లో లబ్ధిదారులకు చెల్లించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్(ysr) ఆసరా పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 2 వాయిదాల్లో రూ.12,758.28 కోట్లు చెల్లించింది. మూడో విడతతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లు పంపిణీ చేశారు.