»Isro Lvm3 M3 One Web India 2 Mission Launch Successful
ISRO: LVM3-M3 వన్ వెబ్ ఇండియా-2 మిషన్ ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రవేశపెట్టిన మరో రాకెట్ LVM3-M3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) నుంచి దీనిని ప్రయోగించారు. LVM3 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువుతో వన్‌వెబ్(OneWeb) యొక్క చివరి విడత 36 Gen1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.
ఇస్రో(ISRO) ఈరోజు ఉదయం (మార్చి 26న) ప్రవేశపెట్టిన LVM3-M3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre)నుంచి దీనిని ప్రయోగించారు. LVM3 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువుతో రెండవ లాంచ్ ప్యాడ్ రాకెట్ పోర్ట్ నుంచి 36 OneWeb ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన పేలోడ్ రాకెట్ మిషన్‌లో LVM3 మొత్తం 5,805 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను 450 km వృత్తాకార కక్ష్యలో ఉంచనుంది. రాకెట్ టేకాఫ్ అయిన 19 నిమిషాల తర్వాత ఉపగ్రహ విభజన ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత 36 ఉపగ్రహాల విభజన దశలవారీగా జరుగుతుందని వెల్లడించారు.
ఇస్రో వాణిజ్య విభాగం, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) 1,000 కోట్ల రూపాయల ప్రయోగ ఒప్పందంలో భాగంగా రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి OneWebతో ఇస్రో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి దశలో 36 ఉపగ్రహాలను అక్టోబర్ 23, 2022న LVM3-M2/OneWeb India-1 మిషన్‌లో ప్రయోగించారు. ఈ నేపథ్యంలో తాజాగా రెండో దశలో మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. ఇది LVM3 యొక్క ఆరవ ఫ్లైట్. LVM3 చంద్రయాన్-2 మిషన్‌తో సహా ఐదు వరుస విజయవంతమైన మిషన్లను కలిగి ఉంది.
OneWeb అనేది ఒక అంతరిక్ష ఆధారితమైన గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇది ప్రభుత్వాలు, వ్యాపారాలు, సంఘాల కోసం కనెక్టివిటీని అనుమతిస్తుంది. ఇద ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల కూటమి సహా పలు అంశాలను అమలు చేస్తుంది. భారతదేశానికి చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ వన్‌వెబ్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా పనిచేస్తుంది. ఇది OneWeb యొక్క 18వ ప్రయోగం. ఈ సంవత్సరం ఇది మూడవది. OneWeb మొత్తం కాన్స్టెలేషన్ను 618 ఉపగ్రహాలకు తీసుకువచ్చింది.