»Congress Sankalp Nationwide Satyagraha Against Rahuls Disqualification
Rahul Gandhi: అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహం
రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సత్యాగ్రహానికి అనుమతి నిరాకరించబడినప్పటికీ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ(rahul gandhi)పై అనర్హత వేటు పడిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహం'(Sankalp Satyagraha) నిర్వహిస్తోంది. అందులో భాగంగా పార్టీ నేతలు ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సత్యాగ్రహా దీక్షకు తరలివచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర నేతలు కూడా నిరసనలో పాల్గొనేందుకు రాజ్‌ఘాట్‌కు చేరుకుని దీక్షలో పాల్గొన్నారు. వీరితోపాటు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పవన్ కుమార్ బన్సల్, శక్తిసిన్హ్ గోహిల్, జోతిమణి, ప్రతిభా సింగ్, మనీష్ చత్రత్ కూడా నిరసనకు హాజరయ్యారు.
అయితే సత్యాగ్రహానికి పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వేదిక వెలుపల గుమిగూడారు. దీంతో శాంతిభద్రతలు, ట్రాఫిక్ కారణాల వల్ల సత్యాగ్రహం చేయాలనే అభ్యర్థన తిరస్కరించబడిందని, రాజ్‌ఘాట్, పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CrPC కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సత్యాగ్రహానికి అనుమతి నిరాకరించబడినప్పటికీ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ‘సంకల్ప్ సత్యాగ్రహం’ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ(telangana)లో సైతం రాహుల్ గాంధీ(rahul gandhi)కి మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ఎలాంటి సత్యాగ్రహం చేస్తున్నారో స్పష్టంగా ఉంది. సిక్కుల హంతకుడు (జగదీష్ టైట్లర్) ఈ సత్యాగ్రహంలో చేరాడని బీజేపీ(BJP) నేత ఆర్పీ సింగ్(RP singh) ఆరోపించారు. టైట్లర్ లేకుండా కాంగ్రెస్ ఉండలేదు. ఇది సత్యాగ్రహమా లేక సిక్కులను చంపిన వ్యక్తిని తిరిగి స్థాపించే ప్రయత్నమా అనేది స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో లోక్ సభకు అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ శనివారం తన తొలి విలేకరుల సమావేశం నిర్వహించారు. అదానీపై తన తదుపరి ప్రసంగానికి ప్రధాని మోడీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అతని కళ్లలో భయం చూశానని చెప్పారు. మరోవైపు రాహుల్ అనర్హత అంశంపై కాంగ్రెస్ పార్టీ(congress party) సుప్రీంకోర్టు(supreme court)లో పిటిషన్ దాఖలు చేసింది.