తెలంగాణ(Telangana)లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad weather department) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ (Orange alert)ను జారీ చేస్తూ ప్రకటన చేసింది. శనివారం రాత్రి వరకూ ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (weather department) వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భీకరమైన ఈదురుగాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (weather department) తెలిపింది. ఆదివారం వరకూ సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ (weather department) జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ (Yellow alert)ను జారీ చేస్తూ ప్రకటన చేసింది.