»Mlas Who Collected Paise In Dalit Bandhu Should Be Sacked Etala
Dalita bandhu : దళితబంధు’లో పైసలు వసూలు చేసిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి : ఈటల
దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఈటల (MLA Etala) రాజేందర్
దళిత బంధు (Dalita bandhu) మంజురు కోసం పైసాలు తీసుకున్న ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే ఈటల (MLA Etala) రాజేందర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడారు. దళితబంధు పథకంలో డబ్బు ఇప్పించేందుకు కొందరు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు రూ.3 లక్షల లంచం తీసుకున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని అన్నారు. సదరు ఎమ్మెల్యేలు బాధితులకు ఆ డబ్బును వాపస్ ఇవ్వాలన్నారు. హుజూరాబాద్(Huzurabad) ఉపఎన్నికల సమయంలో రూ.2లక్షల కోట్లతో దళితబంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్(CM KCR) ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేసి హామీ నిలబెట్టుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంకా మూడు వేల కుటుంబాలకు ఈ పథకం అందలేదని, మొదటి విడత ఎంపికైన వారందరికీ తక్షణమే రెండో విడత డబ్బు చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు.
దళితబంధులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తుంటే మీరేం చేస్తున్నారు?వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు?అని ప్రశ్నిస్తున్నారు. ఎద్దేవా చేస్తున్నారు.దీంట్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay), వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు.దీనిపై బండి సంజయ్ వ్యాఖ్యానిస్తు ‘మీ అనుచరులు కమీషన తీసుకుంటే మీదే బాధ్యత..30 శాతం కమిషన్ సార్-కార్ అంటూ ట్వీట్ చేశారు.ఇక దీనిపై షర్మిల (Sharmila) తనదైనశైలిలో విమర్శలు చేశారు. దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అని ప్రశ్నించారు.అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అటువంటి బీఆర్ఎస్ కు అధికారంలో ఉండే అర్హత లేదంటూ విమర్శలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)కు ఓటమి తప్పదని ప్రజలకే కర్రుకాల్చి వాత పెట్టేరోజు దగ్గరలోనే ఉంది అంటూ విమర్శించారు.