»Nobody Can Take Our Land Amit Shah Over Chinas Objection On Arunachal Visit
Amit Shah: అరుణాచల్‌లో చైనా కొత్త పేర్లపై అమిత్ షా గట్టి కౌంటర్
తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు
తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద (Amit Shah Arunachal Pradesh tour) చైనా అభ్యంతరం చెప్పడంపై (China’s objection on Amit Shah’s Arunachal visit) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు (Nobody Can Take Our Land). భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని చెప్పారు. మన భూభాగాన్ని అంగుళం కూడా తీసుకోలేరన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమ పరిధిలోకి వస్తుందన్న చైనా, ఆ ప్రాంతంలో భారత్ అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం తమ దేశ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అని దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసింది. దీనిపై అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ పైన భారత్ – చైనా మధ్య మాటల యుద్ధం సాగుతున్నప్పటికీ కేంద్ర హోంమంత్రి మాత్రం తన షెడ్యూల్ ప్రకారమే పర్యటించారు.
2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా అభివృద్ధికి దూరంగా ఉండేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక లూక్ ఈస్ట్ విధానంతో భారత అభివృద్ధిలో ఈ ప్రాంతం కూడా భాగమైందన్నారు. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన భారత్ లో భాగమైన అరుణాచల్ ను దేశం నుండి ఎవరూ వేరు చేయలేరన్నారు. భారత సైనిక, సరిహద్దు భద్రతా దళాలను ప్రశంసించారు అమిత్ షా. ఐటీబీపీ జవాన్లు, ఇండియన్ ఆర్మీ అహర్నిషలు శ్రమిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోందన్నారు. జవాన్ల త్యాగం వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారన్నారు. భారత్ ను చెడు దృష్టితో చూసే శక్తి ఎవరికీ లేదని గర్వంగా చెప్పగలమన్నారు. జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.
కాగా, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రదేశాలకు మాండరీన్ పేర్లు పెట్టింది చైనా. అవి తమ దేశ సంపదగా చైనా పౌర వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు అరుణాచల్ ను దక్షిణ టిబెట్ చూపిస్తున్న మ్యాప్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనపై చైనా మీడియా సంస్థ అక్కడి విదేశాంగ శాఖ ప్రతినిధిని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆయన అది చైనా భూభాగమని, ఇక్కడ భారత్ పర్యటన తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. దీనిపై అమిత్ షా ధీటైన కౌంటర్ ఇచ్చారు.