»Music Director Devi Sri Prasad Getting Marriage Soon
Bachelor Lifeకు దేవిశ్రీ ప్రసాద్ బ్రేక్.. త్వరలోనే పెళ్లి
అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్యలో దేవి చేసిన సందడి మామూలుగా లేదు. కాకపోతే ఆ సినిమాలో దేవి సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
క్రేజీ సంగీత దర్శకుడు (Music Director) దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ (Bachelor Life)కు ముగింపు పలకనున్నాడట. నాలుగు పదుల వయసు దాటిన ఈ రాక్ స్టార్ ఇప్పటివరకు పెళ్లి (Marriage) చేసుకోలేదు. ఏ సినిమా కార్యక్రమానికి వెళ్లినా పెళ్లి ప్రస్తావన వస్తుండడంతో దేవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తనకు నచ్చిన అమ్మాయి దొరకలేదని ఇన్నాళ్లు సింగిల్ గా ఉన్నాడు. తాజాగా అతడికి సరైన జోడీ లభించిందని సమాచారం. త్వరలోనే దేవి వివాహం చేసుకోనున్నాడని సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. అయితే అతడు చేసుకోబోయే అమ్మాయి ఎవరో అనేది ఇంకా స్పష్టత రాలేదు.
శాస్త్రీయ సంగీతం నుంచి ఫాస్ట్ బీట్ సంగీతం వరకు దేవి అన్ని రకాల స్వరాలను సమకూరుస్తాడు. సంగీతం అందించడమే కాకుండా పాటలు కూడా పాడుతుంటాడు. సినీ పరిశ్రమలో (Cine Industry) ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు లేనంత క్రేజీ దేవికి ఉంది. అతడు ఏ ఈవెంట్ (Event)లో పాల్గొన్నా సందడి చేస్తుంటాడు. అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్యలో (Waltair Veerayya) దేవి చేసిన సందడి మామూలుగా లేదు. కాకపోతే ఆ సినిమాలో దేవి సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పూనకాలు లోడింగ్ అనే పాట అంతగా రీచ్ కాలేదు. ఇలా సినిమాల్లో బిజీగా ఉంటున్న ఈ రాక్ స్టార్ పెళ్లి చేసుకోనున్నాడు.
అతడు చేసుకోబోయే అమ్మడు ఎవరో తెలుసా? దూరపు చుట్టాల అమ్మాయిని (Relative) దేవి పెళ్లి చేసుకోబోతున్నాడట. వరుసకి మరదలు అవుతుందని సమాచారం. అయితే వీరిద్దరికీ దాదాపు 17 ఏళ్ల వయసు (Age) తేడా ఉందంట. దేవి వయసు 43 ఏళ్లు కాగా, అమ్మాయి వయసు 26 ఏళ్లు అట. కుటుంబసభ్యుల నిర్ణయం ప్రకారం వీరి వివాహం జరుగుతుందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వస్తేనే ఈ వార్తపై పూర్తి స్పష్టత రానుంది. కాగా దేవి గతంలో ఓ హీరోయిన్ (Heroine)తో ప్రేమాయణం (Love) సాగిస్తున్నాడనే పుకార్లు సాగాయి. కానీ అవి వాస్తవం కాదని తేలిపోయాయి. ఇక పెళ్లితో అతడి జీవితంలో ఇలాంటి పుకార్లకు తెరపడనుంది.