మనుషులకు కోతులతో ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. కోతులను పట్టుకుని ఆడించేవారు కొందరైతే.. కొతులు వెంటపడితే పరిగెత్తే వారు మరికొందరు. ఏంది హాస్యం అనుకుంటున్నారా.. అవును మీరనుకునేది నిజమే…ఇది హాస్యమే. ఇలాంటి ఘటనే కొతిలో ఓ వ్యక్తికి జరిగింది. మామూలుగా కోతులు, మనుషులు ఒక్కోసారి అచ్చం ఒకేలాగే ప్రవర్తిస్తుంటారు. అన్ని విషయాలలో కాదనుకోంది. కొన్ని విషయాల్లోనే.
అయితే కోతులకు అరటి పండ్లు అంటే ఎంతిష్టమో మీ అందరికీ తెలిసిందే. ఎన్ని పండ్లనైనా తినేస్తాయి. పైగా అరటిపండ్ల చెట్లు ఉన్న ఇళ్లనైతే గుల్ల చేస్తాయి. సరే ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. ఓ వ్యక్తి పెద్దకోతికి అరటి పండును ఇచ్చాడు. కాకపోతే సగం తిని ఇచ్చాడు. ఆకోతి ఆ సగం తిన్న పండును చూసి ఏంటి వీడు సగంతిని ఇస్తున్నాడు. అసలు నన్నేం అనుకుంటున్నాడు. అని అనుకున్నట్లుగా ఒక్క చూపు చూసింది. అంతే ఆ వీడియో వైరలై చక్కర్లు కొడుతోంది.
వీడియోను చూసిన కొందరు అచ్చం బ్రహ్మానందంలా కళ్లుతిప్పుకుంటుందేందిరా.. అని అంటున్నారు. కోతికి అరటి పండు ఇవ్వాలనుకున్న వ్యక్తికి కోతి చూసిన చూపుకు మతిపోయింది. అయినా మరో సారి అలాగే సగం తిన్న పండునే ఇవ్వజూపాడు. ఆ కోతి లుక్ ను చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దాంతోపాటే కోతి ఏమనుకుంటుందో కూడా కల్పించి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “ఏంటి బ్రో.. నువ్వు సగం తిన్న పండును నాకు ఇస్తావా.. నీకు నవ్వులాటగా ఉందా అని కోతి ప్రశ్నిస్తుందని” అని కామెంట్ చేశారు.