Minister suresh makes sensational comments on pawan kalyan
Pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan kalyan) ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ (suresh) హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఓ రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. ఆయన టీడీపీ (tdp), బీజేపీ (bjp) రెండు పార్టీలతో కలిసి పనిచేస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్పాలని సురేష్ (suresh) డిమాండ్ చేశారు.
ఢిల్లీలో పవన్ (pawan) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (jp nadda) నిన్న మీట్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు గుడ్ బై చెప్పేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తమది.. బీజేపీది (bjp) ఒక్కటే నినాదం అని పేర్కొన్నారు. 4 ఎమ్మెల్సీ (4 mlc) స్థానాలు గెలవగానే ఏదో సాధించినట్టు టీడీపీ నేతలు (tdp leaders) ఫీలవుతున్నారని చెప్పారు.
175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి (telugudesam party) అభ్యర్థులు లేరన్నారు. వైసీపీ (ycp) అన్ని చోట్ల పోటీ చేస్తుందని చెప్పారు. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్ల (300 crores) సీమెన్స్ స్కామ్ (scam) జరిగిందని చెప్పారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.
వచ్చే ఏడాది మే (may) నెలలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ (pawan).. టీడీపీ, ఇటు బీజేపీతో సఖ్యంగా ఉంటున్నారు. ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తారనే అంశం మాత్రం తెలియరాలేదు. అల్టిమేట్‌గా వైసీపీని (ycp) దెబ్బకొట్టాలని పవన్ (pawan) అంటున్నారు. వైసీపీ (ycp) మాత్రం తిరిగి అధికారం చేపడుతామనే ధీమాతో ఉంది.