Paper leak:పదో తరగతి (ssc) పేపర్ లీక్ అంశం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. వరసగా రెండు రోజులు పేపర్ లీక్ అయ్యింది. బీజేపీ కార్యకర్త ప్రశాంత్ (prashanth).. ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు (bandi sanjay) పేపర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్‌ను (bandi sanjay) కూడా పోలీసులు (police) అరెస్ట్ చేశారు. అయితే పేపర్ లీక్‌కు (paper leak) సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (balka suman) సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దలకు పేపర్ లీకేజీతో సంబంధం ఉందని కామెంట్ చేశారు.
టెన్త్ హిందీ పేపర్ లీక్ (hindi paper leak) చేసిన ప్రశాంత్ (prashanth) బీజేపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నారని బాల్క సుమన్ (balka suman) గుర్తుచేశారు. ప్రధాని మోడీ (modi), అమిత్ షా (amith shah), సునీల్ బన్సల్ (sunil bansal), తరుణ్ చుగ్ (tarun chug) నేతృత్వంలో కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టాలని దుష్టశక్తులు చూస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ కీలక నేత పర్యటనకు ముందు అలజడి చేస్తారని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని చులకన చేసే కుట్ర చేస్తుంటారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో (maharashtra) తమ పార్టీకి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు. బీజేపీ నేతలపై (bjp leaders) నిఘా పెట్టాలని డీజీపీని (bjp) కోరారు. బండి సంజయ్‌పై (bandi sanjay) పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌పై (bandi sanjay) లోక్ సభలో అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్‌ను (loksabha speaker) కోరారు.