»Megastar Chiranjeevi Appreciates To Balagam Movie Team
MegaStar ఇలా షాక్ లు ఇస్తే ఎలగయ్యా? బలగం దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు. ఇది నా బలగం విజయం.
విమర్శకుల ప్రశంసలు అందకుంటూ విజయం దిశగా దూసుకెళ్తున్న సినిమా ‘బలగం (Balagam Movie)’. తెలంగాణ (Telangana) గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాల (Family Sentiments) ఇతివృత్తంగా జబర్దస్త్ నటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తెరకెక్కించిన సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణ మంత్రులతో పాటు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఈ సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా బృందాన్ని మెగాస్టార్ (Megastar) చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణును సన్మానించి ప్రశంసల వర్షం కురిపించాడు.
సన్మానించిన అనంతరం చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ‘కాదయ్య.. నువ్వు ఇలా షాక్ లు ఇస్తే ఎలా అయ్యా. ఇంత బాగా చేసేశావు సినిమా. వాస్తవ జీవిత కథ ఈ సినిమా. నిజాయితీగా తీశావు. సినిమా బాగుంది.. సినిమాకు న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని వందశాతం తెరపై ఎక్కించావు. జబర్దస్త్ లో కూడా వేణు బాగా చేశాడు. స్కిట్స్ లో కూడా జానపద కళలను చూపించేవాడు. వేణులో ఇంత ప్రతిభ ఉందా అని అనుకున్నా. నాటి నుంచి వేణుపై గౌరవం పెరిగింది. గ్రేట్ జాబ్..’ అంటూ చిరంజీవి వేణును అభినందనల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా నటుడు ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, చిత్ర నిర్మాతలు హన్షిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డితో పాటు దిల్ రాజు తదితరులు ఉన్నారు.
చిరంజీవి కలవడంపై వేణు ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు. ఇది నా బలగం విజయం. రుణపడి ఉంటాను చిరంజీవి గారికి. మీ ఆత్మీయ స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు’ అంటూ పోస్టు చేశాడు. కాగా బలగం సినిమా విజయవంతంగా థియేటర్ లలో కొనసాగుతోంది.
చిత్ర బృందం చిరంజీవిని కలిసిన ఆనందంలో మునిగింది. ఇక చిత్ర హీరో ప్రియదర్శి స్పందిస్తూ..‘చిరు అన్నయ్య.. మీ సినిమాలు చూసి ఎన్నో సందర్భాల్లో నేను స్ఫూర్తి పొందా. అలాంటి నేను ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమ అభిమానాన్ని పొందడం చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. బలగం కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒకరోజు మీతో కలిసి పని చేస్తానని భావిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు థాంక్యూ సో మచ్ సార్ నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు ఇది నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి Thank you megastar @KChiruTweets Garu for your kind words ! pic.twitter.com/WkeNJ48e3j
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 11, 2023