తన తొలి చిత్రం “RX100”తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన కొత్త చిత్రం “మంగళవరం(Mangalavaaram)”తో తిరిగి వస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ హారర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పూత్. ఆ సినిమాలో ఆమె నటన, అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా, మంచి అవకాశాలే అందుకుంటూ కెరీర్ లో ముందకు వెళుతోంది. అయితే, ఈ మధ్య పాయల్ తెరపై కనిపించి చాలా రోజులు అవుతోంది. ఈ క్రమంలో ‘మంగళవారం(Mangalavaaram)’ అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యింది.
తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి(ajay bhupathi)ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎక్స్100 తో హిట్ కొట్టిన అజయ్ భూపతి, ఆ తర్వాత మహా సముద్రం సినిమా తీశారు. సిద్ధార్ధ్, శర్వా లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఈసారి అజయ్ రూట్ మార్చి, ఇంట్రస్టింగ్ కథతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అదే మంగళవారం. కాగా ఈ మూవీ టీజర్ ని తాజాగా విడుదల చేశారు. టీజర్‌లోని సీన్స్ ఎక్కువగా డార్క్ మోడ్‌లోని కనిపిస్తూ ఆసక్తిని పంచుతోన్నాయి. టీజర్ చివరలో బోల్డ్ సీన్స్‌లో పాయల్ కనిపించింది. అలాగే ముసుగు ధరించిన మనిషిని కూడా చూపించారు. మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియన్(pan india) లెవెల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మహా సముద్రం తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. మరోవైపు ఆర్ఎక్స్ 100 తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసిన పాయల్ రాజ్‌పుత్ ఆ స్థాయి కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. మంగళవారం సినిమాపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది పాయల్. ఇందులో కంప్లీట్‌గా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.