కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే(mallikarjun karge) విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్ 17న జరిగిన ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మల్లికార్జున్ ఖర్గేకు 7897 ఓట్లు రాగా… ఇక ప్రత్యర్థి నేత శశి థరూర్(shashi tharoor) 1072 ఓట్లు వచ్చాయి.
416 ఓట్లు తిరస్కరణకు గురికాగా…ఖర్గే దాదాపు 8 రెట్లు ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించారని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ ప్రకటించారు. మరోవైపు సుమారు 24 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను గాంధీ ఫ్యామిలీ కాకుండా ఇతర వ్యక్తులు చేపడుతున్నారు.