Sharad Pawar రాజీనామా తిరస్కరణ.. మీరే కొనసాగాలని NCP నిర్ణయం
యన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని సమావేశంలో చర్చ జరిగింది. దీంతో అందరి అభిప్రాయం మేరకు శరద్ పవార్ నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్యానెల్ తీర్మానించింది.
రాజకీయ దురంధరుడు శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో (Maharashtra) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP) ప్యానెల్ తిరస్కరించింది. మీరు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది. మీ రాజీనామా (Resignation) తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ (Praful Patel) తెలిపారు.
జాతీయ అధ్యక్ష (National President) పదవికి పవార్ రాజీనామాతో దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ప్యానెల్ కమిటీ (Panel Committee) శుక్రవారం సమావేశమైంది. ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ (NCP) నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని సమావేశంలో చర్చ జరిగింది. దీంతో అందరి అభిప్రాయం మేరకు శరద్ పవార్ నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్యానెల్ తీర్మానించింది. ఆ కమిటీలో పవార్ కుమార్తె సుప్రీయా సూలే (Supriya Sule), సోదరుడి కుమారుడు అజిత్ పవార్, పార్టీ నాయకులు ప్రఫుల్ పలేట్, ఛగన్ బుజుబల్ తదితరులు ఉన్నారు. తీర్మానం అనంతరం మీడియాతో ప్రఫుల్ పటేల్ మాట్లాడారు. పవార్ రాజీనామా చేస్తే ఊరుకోలేమని స్పష్టం చేశారు. 1999లో స్థాపించిన పార్టీని వదులుకోవడంపై పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
పవార్ వెనక్కి తగ్గాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నాయకులు సీతారాం ఏచూరి, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్, సీపీఐ అగ్ర నాయకుడు డి రాజా తదితరులు ఫోన్ చేసి కోరినట్లు ప్రఫుల్ వెల్లడించారు. 2024 ఎన్నికలకు శరద్ పవార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేస్తాయని తెలిపారు. కాగా తన రాజీనామాను తిరస్కరించడంపై శరద్ పవార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన వెనక్కి తగ్గుతురా? అదే పట్టుదలతో ఉంటారా అనేది వేచి చూడాలి. కాగా పవర్ రాజీనామాపై విరమించుకోవాలని కోరుతూ రెండు రోజుల కిందట సందీప్ కాలే అనే పార్టీ కార్యకర్త రక్తంతో (Blood) లేఖ రాశాడు.