»Telangana Young Girl Commits To Suicide For Mobile Phone Lost In Regonda
Mobile Phone పోయిందని యువతి బలవన్మరణం.. రేగొండలో ఘటన
అదే బాధతో రమ్య పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూతురును పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సెల్ ఫోన్ (Mobile Phone) పోవడంతో కుటుంబసభ్యులు మందలిస్తారనే ఆందోళనతో (Fear) ఓ యువతి (Young Girl) బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల నివారణ మందు సేవించి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ సంఘటన తెలంగాణలోని (Telangana) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో (Jayashankar Bhupalpally District) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రేగొండ (Regonda) మండలం రామన్నగూడెం తండాకు చెందిన జగ్గు రవికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జగ్గు రమ్య (22) తన సెల్ ఫోన్ ను గురువారం పోగొట్టుకుంది. ఈ విషయమై తన సోదరిని (Sister) అడగ్గా తాను తీయలేదని చెప్పింది. ఎంత వెతికినా ఫోన్ ఆచూకీ లభించలేదు. ఫోన్ పోవడంతో ఇంట్లో తిడతారని రమ్య భయాందోళన చెందింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. పోతే పోనీయి కొత్త ఫోన్ కొందాం అని కుమార్తెకు చెప్పారు. అయితే ఫోన్ పోయిందనే బాధతో ఆ యువతి మనస్తాపానికి గురైంది.
అదే బాధతో రమ్య పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు (Parents) కూతురును పరకాలలోని (Parakal) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ (Warangal) ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. అక్కడికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి రమ్య మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి నానమ్మ స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అందించినట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.