»Lokesh Tweet On Ys Jagan Over Viveka Death Mystery
Lokesh Fires On Jagan : వైఎస్ వివేకా హత్య కేసు… జగన్ పై లోకేష్ ఫైర్..!
Lokesh On Jagan : వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే... ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా... దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.
వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే… ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా… దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.
” గొడ్డలి మీదే, వేటు వేసింది మీరే. మీ చేతులకు అంటిన రక్తం మరకలు మాకు అంటించాలని చూశావు. ఆధారాలు చెరిపేశావు. జనాల్ని నమ్మించేశాం అనుకున్నావు. గూగుల్ టేక్ అవుట్ కి దొరికేశావు. ఇంకెన్నాళ్లీ తప్పుడు రాతలు, దాగుడుమూతలు జగనాసుర. నేరం ఒప్పుకో.. బాబాయ్ ని చంపిన పాపం ప్రక్షాళన చేసుకో” అని అంటూ పోస్ట్ పెట్టారు.
అలాగే చంద్రబాబు సైతం ట్వీట్ చేసారు. వైఎస్ వివేకా హత్యకు కుట్ర జరిగింది ఆ ఇంట్లోనేనని, ఇది జగనాసుర రక్త చరిత్రేనని చంద్రబాబు విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి, బాబాయి హత్యతో రాజకీయ లబ్ది పొందిన వ్యక్తి ఇప్పుడు ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అంటూ వివేకా హత్య పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.