Kiran kumar reddy: కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ(BJP)లో చేరబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే విషయంపై ఇంత వరకూ క్లారిటీ లేదు.

మొదట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ(BJP) అగ్ర నేతలు ఈ మాజీ సీఎంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్(Congress)కు రాజీనామా చేసిన తరుణంలో మరో రెండు రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో భేటీ అవుతారని సమాచారం.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) చదువుకున్నదంతా కూడా హైదరాబాద్ లోనే. తండ్రి వారసత్వంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పీలేరు రాజకీయాల్లో తిరుగులేని నేతగా కిరణ్ కుమార్ రెడ్డి నిలబడలేదు. పీలేరు నియోజకవర్గంలో ఆయనకు అపారమైన పట్టు అయితే లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్(Congress)కు రాజీనామా చేసి సొంతంగానే పార్టీ పెట్టారు. జై సమైక్యపార్టీ పేరుతో 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే నిరాశే ఎదురైంది. డిపాజిట్లు కూడా రాకపోవడంతో కొంత కాలం మౌనంగా ఉండి ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడికి లేఖ పంపారు.