AP విశాఖ నగరంలోని పెందుర్తి ప్రాంతంలో కిడ్నీ మార్పిడి(Kidney racket gang) ఒప్పందం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఫ్యామిలీకి ఇస్తానాన్న మొత్తం ఇవ్వకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఏపీలోని విశాఖ( Visakha)లో కిడ్నీ రాకెట్ ముఠా(Kidney racket gang) అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నీకి రూ.8.5 లక్షలు ఇస్తామని ఎర జూపి పలువురిని మోసం చేస్తున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి కిడ్నీ తీసుకున్నాక రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చి మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడు వినయ్ కుమార్ ఓ ముఠా చేతిలో మోసపోయామని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ అక్రమ కిడ్నీ మార్పిడి ఒప్పందం 2022 డిసెంబర్లో పెందుర్తి(pendurthi)ప్రాంతంలో జరిగింది. అయితే మధురవాడలోని వాంబే కాలనీకి చెందిన బాధితుడు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజుల క్రితం ఇది వెలుగులోకి వచ్చింది.
కిడ్నీ దాత కోసం వెతుకుతున్నామని ఆటో రిక్షా డ్రైవర్ కామరాజు తన వద్దకు వచ్చి చెప్పాడని ఆయన ఆరోపించారు. వినయ్‌ని కొందరికి పరిచయం చేసి కిడ్నీ(Kidney)దానం చేసేందుకు రూ.8.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు.
వినయ్‌ని కొన్ని పరీక్షల కోసం అక్టోబర్ 2022లో ఒక ప్రైవేట్ సెంటర్‌కి తీసుకెళ్లారు. అయితే వినయ్ కిడ్నీ ఇవ్వడానికి భయపడి హైదరాబాద్ పారిపోయాడు. తర్వాత వినయ్ డిసెంబర్ 2022లో వైజాగ్‌కు తిరిగి వచ్చాడు. అతన్ని కామరాజు, ఎలీనా, శ్రీనులు కిడ్నాప్ చేసి వైజాగ్‌లోని పెందుర్తి సమీపంలోని తిరుమల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వినయ్‌కి ఆపరేషన్ చేసి అతని కిడ్నీని డిసెంబర్ 16, 2022న వైద్యులు తొలగించారు.
వినయ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, కామరాజు, అతని బృందం వినయ్ తల్లికి ఒక కవరు ఇచ్చారు. అందులో రూ.5 లక్షలు ఉన్నాయని తెలిపారు. అయితే తెరిచి చూసేసరికి రూ.2.5 లక్షలు మాత్రమే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వినయ్ కుటుంబ సభ్యులు.. కామరాజు, అతని బృందం కోసం వెతికారు. అయితే ఆ ముఠా వైజాగ్ నగరంలో అదృశ్యమైంది. దీంతో బాధితుల ఫిర్యాదు ఆధారంగా పీఎం పాలెం పోలీసులు(police) కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.