మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులకి ఓబీసీ కోటాలో రిజ్వేషన్లు ఇప్పిస్తే బావుంటుందన్నారు. 1989 నుండి కాపులు మద్దతు ఇచే పార్టీలే విజయం సాధిస్తూ వస్తున్నాయని చెప్పారు. 20 శాతానికి పైగా కాపులు ఉన్నారని, కానీ ఎన్నికల సమయంలోనే వారిని ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే నిర్ణయం ఆయనకు వదిలేయాలి అన్నారు. బయటి నుండి. ఎవరు ప్రభావితం చేయాలని చూడవద్దు అన్నారు. పోరాడితే పవన్ కళ్యాణ్ కి అవకాశం ఉంటుంది అన్నారు. పవన్ అనుభవం కలిగిన నాయకుడు అని, రెండు ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. ప్రజల సమస్యలు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడితే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు.
జీవీఎల్ నర్సింహ రావు ఎం చేశారని కాపులతో సన్మానం చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. ఎందుకో నాకు అయితే అర్థం కావడం లేదు అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ అన్నారు. గతంలో ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర పరిధిలో ఉండేదని, ఇటీవలే చట్టసవరణ చేసి దానిని నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. దీనిపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రశ్న వేసి సమాధానం చెప్పించారని, ఆ సమాధానం గూగుల్లో వెదికినా కనిపిస్తుందన్నారు. కాపు రిజర్వేషన్లు అంశం వైఎస్సార్ తీసుకు వచ్చారని, చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని అన్నారు. అంతకు ముందు విజయ భాస్కర్ రెడ్డి మాత్రమే కాపులకు మేలు చేశారని అన్నారు.
రాజధాని విశాఖ అంటేనే అక్కడి ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు. విశాఖ రాజదాని అంటోంది.. అక్కడ భూములు కొల్ల గొట్టడానికే తప్ప మరో కారణం లేదని ఆరోపించారు. మూడు రాజధానుల అంశం జగన్ కుట్రలో భాగమే అన్నారు. అమరావతి విషయంలో నేను మొదటి నుండి చెబుతున్నదే ఇప్పుడు నిజమైందన్నారు. అమరావతి అయితే అంతా అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ దోచుకోవడానికి ఏమీ ఉండదన్నారు. అదే విశాఖ అయితే అభివృద్ధి చెంది ఉందని, కాబట్టి ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చనేది జగన్ ఆలోచన అన్నారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది ఉండగా.. కన్న లక్ష్మినారాయణ సొంత పార్టీ నేత జీవీఎల్ పైన విమర్శలు చేయడం చర్చనీయంశంగా మారింది. ఆయన పార్టీ మారవచ్చునని చర్చ సాగుతోంది. ఆయన జనసేన వైపు చూస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వైపు. చూస్తున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో కన్నా సొంత పార్టీ నేత పైన విమర్శలు గమనార్హం.