»Japan Hit By 6 1 Magnitude Earthquake No Tsunami Warning
Earthquake: జపాన్లో మరోసారి భారీ భూకంపం
జపాన్(Japan)లో మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఇటీవలే జపాన్ లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారంగా చూస్తే ఉత్తర జపాన్ లోని హక్కైడోలో మంగళవారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తెలుస్తోంది.

జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం జపాన్(Japan)లో సాయంత్రం 6.18 గంటలకు 12 మైళ్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. జపాన్ లో అత్యంత భారీ భూకంపాలు(Earthquake) వచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. వరుస భూకంపాల వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
జపాన్(Japan)లో 2011వ సంవత్సరం సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం ధాటికి సునామీ(Tsunami) అలలు ఎగిసిపడి సెండాయ్ నగరాన్ని ధ్వంసం చేశాయి. 40.5 మీటర్ల ఎత్తులో ఎగిసి పడిన రాకాసి అలల కారణంగా 20 వేల మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస భూకంపాలు చోటుచేసుకుంటూ ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.