ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో 5వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Chennai Super Kings skipper MS Dhoni). అతని కంటే ముందు ఈ రికార్డ్ సాధించిన వారిలో విరాట్ కోహ్లీ 224 ఐపీఎల్ మ్యాచ్ లలో 6706 (Virat Kohli), శిఖర్ ధావన్ 199 మ్యాచ్ లలో 6086 (Dhawan), రోహిత్ శర్మ 221 మ్యాచ్ లలో 5764, డేవిడ్ వార్నర్ 155 మ్యాచ్ లలో 5937 (David Warner), సురేష్ రైనా 205 మ్యాచ్ లలో 5528 (Raina), ఏబీ డివిల్లియర్స్ 184 మ్యాచ్ లలో 5162 పరుగులతో (AB de Villiers) ఉన్నారు. 5000 పరుగులు చేసిన ఏడో బ్యాట్సుమెన్ గా, అలాగే ఐదో భారతీయుడిగా ధోనీ నిలిచాడు. ఈ మైలు రాయి అందుకున్న తొలి వికెట్ కీపర్ (IPL wicket-keeper) కావడం గమనార్హం. నిన్నటి లక్నో సూపర్ జెయింట్స్ (lucknow super giants) మ్యాచ్ కంటే ముందు ధోనీ 234 మ్యాచ్ లలో 4988 పరుగులతో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్ లో 20వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ.. వరుసగా రెండు సిక్స్ లు బాది, ఈ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్ లో 134 స్ట్రైక్ రేటు, 24 అర్ధ సెంచరీలతో నిలిచాడు. చెన్నైలో మూడేళ్ల తర్వాత ధోనీ బ్యాటింగ్ కు రవడంతో ఆ సమయంలో చెపాక్ స్టేడియం హోరెత్తింది. అభిమానులు తమ సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఐపీఎల్ లో (IPL) అత్యధిక ఔట్ లు చేసిన ఘనత ధోనీదే. 170 డిస్మిసల్స్ చేయగా అందులో 131 క్యాచ్ లు, 39 స్టంపింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత డీకే 159 డిస్మిసల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో (lucknow super giants) జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 57 పరుగులు, డెవాన్ కాన్వే 29 బంతుల్లో 47 అదరగొట్టారు.