»International Dance Day 2023 Did You Ram Charan Hrithik Roshan These Steps Look
International Dance Day 2023: రాం చరణ్, హృతిక్ ఈ స్టెప్పులు చుశారా?
నేడు(ఏప్రిల్ 29) అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవం. ఈ క్రమంలో నృత్యం గురించి తెలుసుకోవడంపాటు డ్సాన్స్ చేస్తే మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లుగా తయారవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల డ్యాన్సులను ఇప్పుడు చుద్దాం.
ఈ రోజు(ఏప్రిల్ 29) ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. డ్యాన్స్ అనేది ఒక కళ మాత్రమే కాదు. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నృత్యం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి, మనస్సుకు గొప్ప విశ్రాంతిని ఇస్తూ మంతి టెక్నిక్‌గా పనిచేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న ప్రజలు ఈ అందమైన కళారూపాన్ని జరుపుకోవడానికి అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నృత్యం చేయడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఉల్లాసంగా కూడా ఉంటారని వైద్యులు కూడా చెబుతున్నారు. ఎఫెక్టివ్ డ్యాన్స్ జుంబా నుంచి తక్కువ ప్రభావం చూపే బ్యాలెట్ వరకు ప్రతి ఒక్కరికీ ఒక్కో నృత్య శైలి ఉంది. కాబట్టి ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా మీరు కూడా పలు రకాలుగా స్టెప్స్ వేసి ఆరోగ్యంగా ఉండండి.
ఇక టాలీవుడ్లో ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లను కలిపి ఫ్యాన్స్ ఓ వీడియోను రూపొందించారు. ఇది చూసిన అభిమానులు అదూర్స్ సూపర్ అని అంటున్నారు. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ రామ్ చరణ్ ప్రతిభకు, అతనికి డ్యాన్స్ పట్ల అంకితభావానికి నిదర్శనమని చెబుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును కూడా గెల్చుకున్నారు.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రా ఓ డ్యాన్స్ ప్రదర్శన చేసి తన ఇన్ స్టా ఖాతాలో అభిమానులతో పంచుకుంటూ శుభాక్షాంక్షలు తెలియజేసింది.
మరోవైపు ఇదే రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ముంబై జుహులోని తన నివాసంలో కొంతమంది డ్యాన్సర్లతో సమావేశమయ్యారు. 2000లో తన తొలి చిత్రం ‘కహో నా…ప్యార్ హై’ హిట్ డ్యాన్స్ రికార్డులను బద్దలు కొట్టినప్పటి నుంచి బాలీవుడ్లో హృతిక్ గొప్ప డ్యాన్సర్‌గా పేరుగాంచారు.