Asian Games-2023: ఆసియా క్రీడల్లో భారత్ రికార్డ్..100కు చేరిన పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ రికార్డును నెలకొల్పింది. శనివారం రోజున భారత్ ఖాతాలోకి 100 పతకాలు చేరాయి. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇది సాధ్యమైంది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా క్రీడల్లో (Asia Games) భారత్ పతకాలతో దూసుకుపోతోంది. శనివారంతో భారత్ ఖాతాలోకి 100 పతకాలు (100 Medals) చేరాయి. ఆర్చరీలో కాంస్యం తర్వాత భారత్ బంగారు పతకాన్ని పొందింది. ఆర్చరీ ఫైనల్లో భారత్కు చెందిన జ్యోతి వెన్నం విజేతగా నిలిచి గోల్డ్ పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి జ్యోతి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అంతకుముందే అదితి విలువిద్యలో ఇండియాకు కాంస్య పతకాన్ని అందించింది.
AND THAT IS MEDAL #100 FOR 🇮🇳!!!
HISTORY IS MADE AS INDIA GETS ITS 100 MEDAL AT THE ASIAN GAMES 2022!
This is a testament to the power of dreams, dedication, and teamwork of our athletes involved in the achievement of #TEAMINDIA!
కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్లో అదితి స్వామి ఇండోనేషియా క్రీడాకారిణిని ఓడించింది. దీంతో 17 సంవత్సరాల అదితి భారత్కు కాంస్యం అందించి అద్భుత రికార్డును నెలకొల్పింది. ఈ నేపథ్యంలో చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100వ పతకాన్ని కైవసం చేసుకుంది.
🥇🇮🇳 𝐀𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞 𝐝𝐨𝐦𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧!
Our Women's Kabaddi team has emerged victorious, defeating the Chinese Taipei team and securing the coveted Gold Medal 🥇🌟
The unparalleled skill, tenacity, and teamwork of the women's team have brought glory to the nation🥳. And… pic.twitter.com/SG9Qq1rZzu
శనివార జరిగిన కబడ్డీ పోటీల్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచి మరో స్వర్ణ పతకాన్ని (Gold Medal) అందించింది. దీంతో భారత్ (India) ఖాతాలోకి 100వ పతకం చేరింది. కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యాన్ని నేడు భారత్ సాధించడం విశేషం.
Hangzhou Asian Games: Ojas Pravin Deotale wins gold by defeating Abhishek Verma (149-147) in the men's compound archery final.