»Ind Vs Aus Mohammed Shami Mohammed Siraj Pick Three Wickets Each Australia Crumble To 188 All Out
India Vs Australia: 188 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్..షమీ, సిరాజ్ దూకుడు
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్(Ausis) టీమిండియా(Team India) బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలోనే 188 పరుగులు చేసి కుప్పకూలింది. ఆసీస్ ఆలౌట్ అయ్యింది. టీమిండియా(Team India) పేసర్లు అయిన షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ జడేజా(Jadeja) రెండు వికెట్లను పడగొట్టాడు.
నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా(IND VS AUS) వన్డే సిరీస్ ప్రారంభమైంది. మ్యాచ్ లో భాగంగా నేడు తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఆస్ట్రేలియాపై టీమిండియా(Team India) బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ముంబయి వాంఖడే స్టేడియంలో జరుగుతోన్న ఈ తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా(Team India) మొదట టాస్ గెలిచి బౌలింగ్(Bowlling) ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్(Ausis) టీమిండియా(Team India) బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలోనే 188 పరుగులు చేసి కుప్పకూలింది. ఆసీస్ ఆలౌట్ అయ్యింది. టీమిండియా(Team India) పేసర్లు అయిన షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ జడేజా(Jadeja) రెండు వికెట్లను పడగొట్టాడు.
టీమిండియా(Team India) కెప్టెన్ హార్థిక్ పాండ్యా 1 వికెట్, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. ఇకపోతే ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అయిన మిచెల్ మార్ష్ 81 పరుగులు చేసి తమ జట్టును ఆదుకున్నాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 26, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత వచ్చిన వారిలో లబుషేన్ 15, గ్లెన్ మ్యాక్స్ వెల్ 8, ఓపెనర్ ట్రావిస్ హెడ్ 5, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 12 పరుగులు చేసి ఔట్ అయ్యారు. దీంతో భారత లక్ష్యం(India Target) 189 పరుగులుగా ఉంది.