Margani Bharat హీరోగా చేస్తా.. పది హిట్లు ఇస్తా: వైసీపీ ఎంపీ భరత్
గతంలో కూడా ఇలాంటి చర్యలతో మార్గాని భరత్ ట్రోలింగ్ కు గురయ్యాడు. తాజా సినిమా వ్యాఖ్యలతో మరింత ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఈ సంఘటనతో మీమర్స్ కు మరో అవకాశం దొరికింది. కాగా భరత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాకీయాలను వదిలి సినిమాల్లోకి వెళ్లాలని చెప్పాడు.
నటుడిగా ఓ సినిమా (Movie) చేసిన ఆయన ఇప్పుడు సినిమాలు చేసినా పది (Ten) హిట్లు (Hits) ఇస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజమండ్రి (Rajamahendravaram) ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) తెలిపాడు. ఇప్పటికిప్పుడు తాను సూపర్ స్టార్ కూడా అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన గ్లామర్ అలాంటిదని పేర్కొన్నాడు. తాను తలచుకోవడమే ఆలస్యమని ప్రకటించాడు. రాజకీయంగా చేసిన ఆ విమర్శలు అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారాయి.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ గురువారం పై వ్యాఖ్యలు చేశాడు. ‘ఏక చిత్ర నటుడు అని కొందరు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నేను కావాలనుకుంటే.. తలచుకుంటే ఒక మంచి సినిమాలో హీరోగా చేయగలను. ఇది పెద్ద గగనమేమి కాదు. ఏక చిత్రం కాదు పది సినిమాలు చేస్తాను. ప్రజలు నన్ను స్వీకరిస్తారు. నాకు ఉన్న ఫేస్ గ్లామర్ అలాంటి. కావాలంటే నన్ను విమర్శిస్తున్న వారికి కూడా నా సినిమాలో ఒక పాత్ర ఇస్తా. నేను ఒక సినిమా కాదు పది సినిమాలు కూడా చేస్తా. ఆ పది సినిమాలు కూడా సూపర్ హిట్ చేస్తా. సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)ని పర్మిషన్ తీసుకుని సినిమాలు చేయాలంటే తనకు పెద్ద విషయం కాదు. పది సినిమాలు చేయగలను. సూపర్ స్టార్ గా కూడా చేయగలుగుతాను. ఆ టాలెంట్ (Talent) నాకుంది. అన్ని రంగాల్లో నాకు టాలెంట్ ఉంది’ అని భరత్ పేర్కొన్నాడు.
భరత్ ను ఉద్దేశించి ‘ఏక చిత్ర నటుడు’ అని ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించాడు. మార్గాని భరత్ ‘ఓయ్ నిన్నే’ (Oy Ninne) అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. సినీ పరిశ్రమ నుంచి వైదొలిగి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజమహేంద్రవరం నుంచి వైసీపీ టికెట్ (Ticket) రాకపోవడంతో జగన్ హవాలో భరత్ విజయం సాధించాడు. కాగా భరత్ వ్యాఖ్యలను చూస్తుంటే ఇంకా సినిమా రంగంపై ఆసక్తి పోనట్టు కనిపిస్తోంది. అందుకే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. సోషల్ మీడియాను ఎక్కువ ఫాలోవుతాడు.
ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో మిలియన్ ఫాలోవర్స్ ను పెంచుకున్న అమ్మాయిని మార్గాని భరత్ సన్మానం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆమె ఆ ఘనత సాధించడం రాజమహేంద్రవరానికి గర్వకారణమని ఎంపీ భరత్ వ్యాఖ్యానించాడు. అతడు సోషల్ మీడియాకు పనికొస్తాడు కానీ రాజకీయాలకు పనికి రాడు అని కామెంట్లు వచ్చాయి. గతంలో కూడా ఇలాంటి చర్యలతో మార్గాని భరత్ ట్రోలింగ్ కు గురయ్యాడు. తాజా సినిమా వ్యాఖ్యలతో మరింత ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఈ సంఘటనతో మీమర్స్ కు మరో అవకాశం దొరికింది. కాగా భరత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాకీయాలను వదిలి సినిమాల్లోకి వెళ్లాలని చెప్పాడు. ఎంపీగా గెలిపించుకున్నందుకు రాజమహేంద్రవరానికి భరత్ చేసిందేమీ లేదని విమర్శలు చేస్తున్నారు.