మహానాడులో చేదు ఘటనలు, అపశ్రుతి చోటుచేసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు కోరుకుంటున్నాయి. వారికి అవకాశం ఇవ్వకుండా మరిన్ని సౌకర్యాలు టీడీపీ నాయకులు కల్పిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ (NT Rama Rao) జయంతి సందర్భంగా ప్రతియేటా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈసారి కూడా ఏపీలోని రాజమహేంద్రవరం (Rajamahendravaram) కేంద్రంగా మహానాడు (Mahanadu) ప్రారంభమైంది. అయితే తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. ఎండ వేడిమికి (Heavy Temperature) తాళలేక పార్టీ కార్యకర్తలు, నాయకులు అస్వస్థతకు గురయ్యారు.
రాజమండ్రిలో శనివారం తొలి రోజు పార్టీ ప్రతినిధుల (Delegates) సమావేశం నిర్వహించారు. మహానాడు సందర్భంగా తెలంగాణ (Telangana), ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. అయితే వేసవి (Summer) కావడంతో ఎండలకు తాళలేకపోయారు. ఎండ తీవ్రతతో అలమటించారు. ఈ క్రమంలోనే వేడికి తాళలేక పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఎండ తీవ్రత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. వెంటనే స్పందించిన వాలంటీర్లు (Volunteers), పార్టీ నాయకులు బాధితులకు సపర్యలు చేపట్టారు.
సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో (Health Camp) వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నీరసించిన వారికి సెలైన్లు (Saline) ఎక్కిస్తున్నారు. మహానాడులో సకల ఏర్పాట్లు చేసినా కూడా ఎండ తీవ్రంగా ఉండడంతో పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఏసీలు (ACs), ఫ్యాన్ (Fan), కూలర్లు (Coolers) ఏర్పాటు చేయడంతోపాటు మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచారు. తొలి రోజే ఇలా కావడంతో టీడీపీ నాయకులు అప్రమత్తమై (Alert) మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మహానాడు విజయవంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, మహానాడులో ఎవరికీ ఏం జరిగినా ఊరుకోను అని ఇప్పటికే రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్ (Margani Bharat) హెచ్చరించిన విషయం తెలిసిందే. మహానాడులో చేదు ఘటనలు, అపశ్రుతి చోటుచేసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు కోరుకుంటున్నాయి. వారికి అవకాశం ఇవ్వకుండా మరిన్ని సౌకర్యాలు టీడీపీ నాయకులు కల్పిస్తున్నారు.