»Director Ss Rajamouli Appointed As Raichur District Election Brand Ambassador
Raichur పుట్టిన గడ్డ రుణం తీర్చుకోనున్న SS రాజమౌళి
ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. మొత్తం ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా మారుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి చెబితే ఓటర్లు తమ ఓటు హక్కు (Right to Vote)వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారని ఎన్నికల సంఘం భావిస్తున్నది.
జక్కన్నగా పేరు పొందిన దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ఖాతాలో ఆస్కార్ (Oscar) కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్కార్ వేడుకల కోసం చిత్రబృందం ఇప్పటికే అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎన్నికల ప్రచారకర్త (Brand Ambassador)గా నియమించారు. ఎక్కడో తెలుసా.. తెలంగాణకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా (Raichur District) ఎన్నికల ప్రచారకర్తగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇంకా నెల 15 రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరుగనున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో ఓటర్లను (Voters) చైతన్యవంతం (Awareness) చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళిని ఎంచుకుంది. ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు. మొత్తం ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా మారుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి చెబితే ఓటర్లు తమ ఓటు హక్కు (Right to Vote)వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జక్కన్నతో కలిసి చైతన్యపరచాలని నిర్ణయించినట్లు రాయచూర్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ (Chandrashekhar Nayak IAS) తెలిపారు. ప్రచారకర్తగా తాము చేసిన ప్రతిపాదనను రాజమౌళి అంగీకరించారని, ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు కూడా తెలిపారు.
చదవండి: Aha పుష్ప ఫేమ్ జగదీశ్ ‘సత్తిగాని రెండెకరాలు’ టీజర్ విడుదల
ముఖ్యంగా రాయచూర్ జిల్లా మాన్వి తాలుకా (Manvi) అమరేశ్వర క్యాంపు (Amareshwara Camp)లో జన్మించిన (Birth) రాజమౌళి ప్రచారంతో జిల్లాలో పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ప్రచారకర్తగా నియమితులైన వారు ప్రత్యక్ష ప్రచారం, వీడియో సందేశాలు తదితర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్లను చైతన్యం చేసేందుకు ప్రచారకర్తలు సిద్ధంగా ఉంటారు. ఈ నియామకంతో పుట్టిన గడ్డ రుణం రాజమౌళి తీర్చుకోనున్నాడు.
కాగా తాను పుట్టిన ఊరి పేరును గతంలో ట్విటర్ ద్వారా రాజమౌళి స్వయంగా చెప్పారు. ఓ నెటిజన్ మీరు పుట్టిన ఊరి పేరు ఏంటి? అని అడగ్గా ‘అమరేశ్వర క్యాంపు, మాన్వి తాలుకా, రాయచూర్ జిల్లా, కర్ణాటక’ అని రాజమౌళి రిప్లయ్ ఇచ్చాడు. బాహుబలిలో మహిష్మాతి సామ్రాజ్య నిర్మాణం కర్ణాటకలోని తన సొంతం ప్రాంతంలో ఉన్న కొన్ని కోటలను ఊహించుకుని రూపొందించినట్లు తెలుస్తున్నది. సినిమాలో లాంటి కట్టడాలు రాయచూర్ జిల్లాలో పలుచోట్ల కనిపిస్తాయి. ఇప్పటికీ ఆ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.