Viral ఇది కదా ట్విస్ట్.. కట్నం తక్కువైందని పెళ్లి రద్దు చేసిన వధువు
కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.
పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషుల (Men)తో సమానంగా మహిళలు (Women) ఎదుగుతున్నారు. సమానంగా కాదు అంతకు మించి రాణిస్తున్నారు. కాలం (Time) మారింది.. అణిగిమణిగి ఉండే అబలలు కాదు అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. తమకు కావాల్సింది సాధించుకుంటున్నారు. ఇప్పటివరకు కట్నం (Dowry) తక్కువైందని వరుడు (Bridegroom) అలగడం.. అధిక కట్నం డిమాండ్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ తొలిసారి అమ్మాయి (Bride) తనకు కట్నం తక్కువైందని తన పెళ్లి (Marriage)ని రద్దు చేసుకున్న సంఘటన తెలంగాణ(Telangana)లో జరిగింది. పెళ్లి మండపానికి చేరుకున్న సమయంలో వధువు ఇచ్చిన ట్విస్ట్ (Twist)తో వరుడి కుటుంబసభ్యులకు దిమ్మతిరిగింది.
హైదరాబాద్ (Hyderabad) శివారులోని మేడ్చల్-మల్కాజిగిరి (Medchal-Malkajgiri District) జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) అశ్వరావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. పెట్టిపోతల్లో (Settlement) భాగంగా యువతికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా మాటలు జరిగాయి. అన్ని కుదిరి పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. ఘట్ కేసర్ (Ghatkesar)లోని ఓ ఫంక్షన్ హాల్ (Function Hall)లో గురువారం రాత్రి 7.21 గంటలకు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది. అంతకుముందే బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. అయితే అమ్మాయి తరఫు వారు మాత్రం రాలేదు. వివాహానికి సమయం ముంచుకొస్తున్నా రాకపోవడంతో వరుడి కుటుంబసభ్యులు వారికి ఫోన్ చేశారు. ఫోన్ లో షాకింగ్ విషయం చెప్పారు.
తమ కుమార్తెకు కట్నం సరిపోలేదని వధువు తల్లిదండ్రులు ఫోన్ (Phone Call)లో తెలిపారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా మరింత కట్నం కావాలని వధువు డిమాండ్ చేసింది. కట్నం తక్కువ కావడంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వధువు తేల్చి చెప్పేసింది. ఈ వింత అనుభవంతో వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాలతో పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా వధువు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పోలీసుల సమక్షంలో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే వధువుకి అప్పటికే ఇచ్చిన రూ.2 లక్షల నగదును అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకోవడం గమనార్హం.
ఈ సంఘటన చూస్తే కాలం ఎంత మారిందో తెలుస్తోంది. అప్పట్ల అబ్బాయి తరఫున వారు పేచీ పెట్టేవాళ్లు. అల్లుడిని శాంతపర్చేందుకు వధువు కుటుంబసభ్యులు అప్పులు చేసి మరీ ఇచ్చేవారు. తీరా పెళ్లయినా తర్వాత కూడా కుటుంబసభ్యులను కట్నం కోసం వేధించేవారు. కానీ ఈ సంఘటనతో పరిస్థితులు మారాయని తెలుస్తోంది. అమ్మాయిలు కూడా చైతన్యం పొందుతున్నారు. ఉల్టా వాళ్లే కట్నం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారు. ఎందుకంటే వాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించే స్థాయికి చేరుకుంటున్నారు. కాగా కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.