భోజనం చేస్తుండగా బిందు శ్రీ ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఉన్న బిందుశ్రీ మొక్కజొన్న గింజలు గమనించింది. వాటిని నోట్లో వేసుకుని తినే ప్రయత్నం చేసింది. గింజలు గొంతులో అడ్డం పడడంతో పాప గిలగిల కొట్టుకుంటూ ఏడ్చేసింది.
దొరికిన ప్రతి వస్తువును చిన్నారులు (Childrens) నోటిలో పెట్టుకుంటారు. వారిని ఓ కంట కనిపెట్టకుండా ఉంటే దారుణ సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉన్న చిన్న గొంతు (Throat)లో పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకుని ఊపిరాడక (Breath) శిశువులు మరణించిన సంఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. తాజాగా తెలంగాణ (Telangana)లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. మొక్కజొన్న (Corn) కంకులు తిన్న చిన్నారి గొంతులో ఆ కంకులు ఇరుక్కుపోయాయి. దీంతో శ్వాస ఆడక ఆ చిన్నారి తీవ్ర అవస్థ పడుతూ మృతి చెందింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem District) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగూడెం (Kothagudem) మండలం రాంపురం గ్రామంలో వెంకటకృష్ణ (Venkatakrishna), అభస్విని దంపతులు. వారికి మూడేళ్ల కుమార్తె బిందు శ్రీ (Bindu Sri) ఉంది. కూలీ పనులు చేసుకునే ఆ దంపతులు మంగళవారం మొక్కజొన్న కంకులు తెచ్చుకుని తిన్నారు. ఆ సమయంలో కొన్ని గింజలు కిందపడ్డాయి. రాత్రి సమయంలో వెంకటకృష్ణ, అభస్విని భోజనం చేస్తుండగా బిందు శ్రీ ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఉన్న బిందుశ్రీ మొక్కజొన్న గింజలు గమనించింది. వాటిని నోట్లో వేసుకుని తినే ప్రయత్నం చేసింది. గింజలు గొంతులో అడ్డం పడడంతో పాప గిలగిల కొట్టుకుంటూ ఏడ్చేసింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని గమనించి వెంటనే ఖమ్మం కానీ, లేదా హైదరాబాద్ (Hyderabad)కు తీసుకెళ్లాలని సూచించారు.
చదవండి: Instagram Outage ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. మీమ్స్ పండుగ
హైదరాబాద్ తీసుకెళ్లేందుకు వారి వద్ద డబ్బులు (Cash) లేవు. దీంతో పలుచోట్ల డబ్బుల కోసం తిరిగాడు. తెలిసిన వారిని డబ్బులు అడిగి హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే పాప బిందుశ్రీ కన్నుమూసింది. పాప మృతితో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పేదరికం (Poverty)తో సకాలంలో పాపను కాపాడుకోలేకపోయామని కుమిలి కుమిలి ఏడ్చారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.