సాధారణంగా అందరూ కోడి లేదా గొర్రె మాంసం తింటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసం(Dog Meat) కూడా తింటారని చాలా మందికి తెలియదు. ఉత్తరాది రాష్ట్రం అయిన నాగాలాండ్(nagaland) ప్రాంతంతో కుక్కల మాంసం తింటారు. శునకాల మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. చాలా ఇళ్లల్లో ఇక్కడ కోళ్లను పెంచుకున్నట్లు అక్కడ కూడా కుక్కలను పెంచుకుని తింటూ ఉంటారు. కొంత మంది దానిని పాపంగా భావిస్తూ ఉంటారు.
కుక్క మాంసం(Dog Meat) తినడానికి చాలా మంది అడ్డు చెప్పారు. దీనిపై కోర్టు కీలక తీర్పునిచ్చింది. కుక్క మాంసం తినేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగాలాండ్ రాష్ట్రంలో ఇకపై కుక్క మాంసం తినొచ్చని గౌహతి హైకోర్టు అనుమతి ఇస్తూ తీర్పునిచ్చింది. గతంలో అక్కడి ప్రభుత్వం కుక్క మాంసం తినడంపై పెద్ద ఎత్తున గొడవలు చేసింది. అయితే కుక్క మాంసం తినడంపై ఇప్పుడు హైకోర్టు(High Court) తినొచ్చంటూ తీర్పునిచ్చింది.
కుక్కల వాణిజ్య దిగుమతి విక్రయ మాంసం(Dog Meat)పై గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా ఆ ఉత్తర్వులను హైకోర్టు(High Court) రద్దు చేసింది. ఈ విషయం మీద కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు కుక్కల మాంసం విక్రయం ఇప్పుడు ఆ రాష్ట్రంలో లీగల్ అయ్యింది. ఈ తీర్పుపై జంతు ప్రేమికులు ఎలా స్పందిస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.