»Heavy Rains In South Korea 31 People Dead 15 Vehicles Stuck
South Korea:లో భారీ వర్షాలు..31 మంది మృతి, చిక్కుకున్న 15 వాహనాలు
దక్షిణ కొరియా(south korea)లో భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన సొరంగం కింద చిక్కుకున్న వారి కోసం సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీయగా మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
దక్షిణ కొరియాలోని(south korea) చియోంగ్జులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 31 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరో 10 మంది గల్లంతైనట్లు తెలిపారు. శనివారం కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున వరద ఓ భూగర్భ సొరంగంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలోని రహదారి వెంబడి 15 వాహానాలు చిక్కుకున్నాయి. ఆ క్రమంలో తప్పిపోయిన వ్యక్తుల కోసం దక్షిణ కొరియా రెస్క్యూ వర్కర్లు వెతుకుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న వ్యక్తులను వెలికితీసెందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఏడుగురు మృత్యువాత చెందినట్లు గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి వరదలు(floods) సంభవించాయి. దాదాపు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా 27,260 గృహాలకు విద్యుత్తు లేకుండా పోయిందని, డజన్ల కొద్దీ గృహాలు వరదల్లో ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ప్రధాన మంత్రి హాన్ డక్-సూ విపత్తుపై స్పందించినప్పటికీ అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు.