»Heavy Rain For 4 Days In Telangana Orange Alert Issued Up To May 2nd 2023
Breaking: తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ!
తెలంగాణ(telangana)లో నేటి నుంచి నాలుగు రోజులు(four days rain) ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతోపాటు గాలులతో కూడిన వడగళ్ల వాన కూడా కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
తెలంగాణ(telangana)లో ఈరోజుతోపాటు నాలుగు రోజులు వర్షాలు(four days rain) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(hyderabad) వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ క్రమంలో ఈరోజు, రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ ద్రోణి దిగువ స్థాయి నుంచి వీస్తున్న గాలుల కారణంగా వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వానలు రానున్న క్రమంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
IMD హైదరాబాద్ ప్రకారం, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లితో సహా హైదరాబాద్(hyderabad)లోని మొత్తం ఆరు జోన్లలో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు హైదరాబాద్, దాని పొరుగు జిల్లాలు, రంగారెడ్డి, మల్కాజిగిరి ప్రాంతాల్లో కూడా చిరు జల్లులు(rain) కురియనున్నట్లు తెలిపింది. ఇంకోవైపు తెలంగాణలోని ఇతర జిల్లాలైన ఆదిలాబాద్, కుమార భీమ్, నిర్మల్, మంచిర్యాలు, జగిత్యాల, నిజామాబాద్, భూపల్ పల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్లో కూడా ఉరుములు మెరుపులు, వడగళ్ల వాన, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ప్రకటించింది.
ఈ క్రమంలో ప్రజలు(people) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిచి అనేక ఇబ్బందులు, విద్యుత్ కోతలు, భారీ ట్రాఫిక్ జాం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.