స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam case)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు ధర్మాసనం ఈ పిటీషన్ తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. దీంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ (Bail) పిటీషన్‌పై అక్టోబర్ 31వ తేదిన తీర్పును వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
ఇకపోతే చంద్రబాబు (Chandrababu) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ఎప్పుడు ఉంటాయనేది రేపే నిర్ణయిస్తామని హైకోర్టు (High Court) ధర్మాసనం తెలిపింది. నేడు చంద్రబాబు తరపున న్యాయవాదులు మధ్యాహ్నం వరకూ తమ వాదనలు వినిపించారు. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.
మొదటగా ఈ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టు (ACB Court)లో బెయిల్ కోసం పిటీషన్ వేశారు. అయితే ఏసీబీ కోర్టు బాబు బెయిల్‌ను (Bail) నిరాకరించింది. దీంతో హైకోర్టులో చంద్రబాబు లాయర్లు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై వరుస విచారణలు సాగగా నేడు ఇరువురి వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాలని, వయస్సు రీత్యా ఆయన్ని ఇంటి వద్దే ఉంచాలని కోర్టుకు బాబు లాయర్లు విన్నవించుకున్నారు. అయితే బెయిల్‌పై హైకోర్టు (HighCourt) రేపు తీర్పు చెప్పనుంది.