చంద్రముఖి 2(Chandramukhi 2)తో సినీ ప్రేమికులను అలరించేందుకు రాఘవ లారెన్స్ వస్తున్నాడు. రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
చంద్రముఖి 2(Chandramukhi 2) సినిమా నుంచి రాఘవ లారెన్స్(Lawrence) ఫస్ట్ లుక్‌ని మేకర్స్ ఈరోజు విడుదల చేసారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో వేట్టైయన్ పాత్రలో నటిస్తున్నాడు. లుక్‌లో లారెన్స్ రాజభవనం నుంచి దిగుతున్నట్లుగా ఉంది. ఆ దుస్తుల్లో రాజసం ఉట్టిపడుతోంది. దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. లుక్‌ను పంచుకుంటూ లారెన్స్ “తలైవర్ సూపర్‌స్టార్ @రజినీకాంత్‌కి ధన్యవాదాలు! ఇదిగో #వెట్టయన్ ఫస్ట్‌లుక్‌ని మీకు అందిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి! ఈ గణేష్ చతుర్థిని తమిళం, హిందీ, తెలుగు, మలయాళం & కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
కంగనా రనౌత్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, మంజిమా మోహన్, సృష్టి డాంగే, సుభిక్ష కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, రాధిక, వడివేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రముఖి2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.