»Gangs Of Godavari First Glimpse Vishwak Sen In Mass Look
Gangs of Godavari: గ్లింప్స్..మాస్ లుక్‌లో విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) రాబోయే యాక్షన్ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(GangsofGodavari) టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మునుపెన్నడూ చూడని లుక్‌లో క్రేజీగా కనిపిస్తున్నారు.
మాస్ కా దాస్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) VS11 మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari)టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక వీడియోలో హీరో విశ్వక్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. లారీపై నిల్చుని లుంగీ కట్టుకుని నోట్లో బీడీ పెట్టుకుని ఉన్న లుక్ క్రేజీగా ఉంది. దీంతోపాటు పలువురి కోసం హీరో పరిగెడుతున్న సీన్స్ సహా హీరోయిన్ DJ టిల్లు-ఫేమ్ నటి నేహా శెట్టి, నటి అంజలి క్యారెక్టర్లు కూడా ఈ చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇది ఒక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు క్యారెక్టర్ నటులు నాజర్, గోపరాజు రమణ కూడా ప్రధాన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వెంకట్ ఉప్పటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఎస్.నాగ వంశీ, సాయి సౌజన్య ఆధ్వర్యంలో రానుంది. ఈ మూవీకి యువన్ శంకర్(Yuvan Shankar Raja) రాజా సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకుడిగా మారడానికి ముందు తెలుగు చిత్ర పరిశ్రమలో గీత రచయితగా పనిచేశారు. అతను గతంలో రౌడీ ఫెలో (2014), ఛల్ మోహన్ రంగ (2018) చిత్రాలకు దర్శకత్వం వహించాడు.