ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో (DLS పద్ధతిలో) ఓడించింది. సోమవారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచులో చైన్నె రికార్డు స్థాయిలో ఐదో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆ క్రమంలో సాయి సుదర్శన్ 96, వృద్ధిమన్ సాహా 56, శుభమాన్ గిల్ 39 ప్రధాన స్కోర్లు చేసి జట్టుకు మద్దతుగా నిలిచారు.
వర్షం కారణంగా ఇన్నింగ్స్ మ్యాచును చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక ఆటకు దిగిన CSK ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 47, శివం దూబే 32, అజింక్య రహానే 27, రుతురాజ్ గైక్వాడ్ 26 పరుగులు చేశారు. ధోనీ డకౌట్ కాగా..స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఓ ఫోర్ కొట్టి 6 బంతుల్లోనే 15 రన్స్ చేసి జట్టు గెలుపునకు కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో CSK నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి బంతికి ఎట్టకేలకు టాస్క్ పూర్తి చేసి గెలుపొందింది. మరోవైపు గుజరాత్ బౌలర్లు మోహిత్ శర్మ 3, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసి మంచి ప్రదర్శన ఇచ్చారు.
సంక్షిప్త స్కోర్లు:
గుజరాత్ టైటాన్స్: 20 ఓవర్లలో 214/4 (సాయి సుదర్శన్ 96, వృద్ధిమాన్ సాహా 54). చెన్నై సూపర్ కింగ్స్: 15 ఓవర్లలో 171/5 (డెవాన్ కాన్వే 47, అజింక్యా రహానే 27, శివమ్ దూబే 32 నాటౌట్, రవీంద్ర జడేజా 15 నాటౌట్; మోహిత్ శర్మ 3/36, నూర్ అహ్మద్ 2/17).