»Ghmc Cycle Friendly City Tag Hyderabad Cycle Used For Short Distances
Cycle Friendly City Hyderabad: చిన్నదూరాలకు సైకిల్ వాడండి!
భాగ్యనగరంలో(hyderabad) పెరిగిన వాహనాల నేపథ్యంలో చిన్న దూరాలకు సైకిల్ ను ఉపయోగించాలని GHMC అధికారులు కోరుతున్నారు. అందుకోసం హైదరాబాద్ లో పలుచోట్ల సైక్లింగ్ ట్రాక్స్(cycling tracks) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు చోట్లు పూర్తి కాగా..మరికొన్ని చోట్లు ఆయా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ ను 'సైకిల్-ఫ్రెండ్లీ' సిటీగా తయారుచేయాలని అందుకు పౌరులు(people) కూడా మద్దతుగా నిలవాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్(hyderabad) నగరంలో మోటారు వాహనాల వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో భాగ్యనగరంలో ట్రాఫిక్ తోపాటు పొల్యూషన్ కూడా క్రమంగా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో మోటారు వాహనాల రద్దీగా తగ్గించడంతోపాటు శాశ్వత పరిష్కారం దిశగా GHMC ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే పలు చోట్ల సైక్లింగ్ ట్రాక్(cycling track)లను నిర్మించాలని GHMC నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ను ‘సైకిల్-ఫ్రెండ్లీ సిటీగా(cycle friendly city hyderabad) మార్చాలని బెంగళూరు(bengaluru)కు చెందిన ఓ కన్సల్టెంట్ కంపెనీతో GHMC ఒప్పందం కూదుర్చుకున్నట్లు తెలిసింది.
చిన్న ప్రయాణాలకు సైకిళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ క్రమంలో వీటిని ఉపయోగించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు. దీంతోపాటు సైక్లింగ్‌ను(cycling )ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు కూడా చురుకుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ‘సైకిల్-ఫ్రెండ్లీ'(cycle friendly tag)ట్యాగ్‌ని సాధించేందుకు మూడేళ్ల సమగ్ర ప్రణాళికను కార్పొరేషన్ రూపొందించిందని పలువురు చెబుతున్నారు.
ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి GHMC గత ఏడాది అక్టోబర్‌లో శాశ్వత, పలు చోట్ల తాత్కాలిక సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించాలని అనుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రాజెక్ట్(project)లను అమలు చేయడానికి నమూనాలను సిద్ధం చేసింది. అయితే ప్రాజెక్టుల నిర్వహణలో అనేక సవాళ్ల కారణంగా ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. సరైన మార్గం లభ్యత, సైకిల్ ట్రాక్‌ల ప్రతిపాదిత ప్రదేశాలలో భారీ ట్రాఫిక్ ఉండటం, ఇతర నోడల్ అధికారుల(officers) నుంచి సహకారం లేకపోవడం వంటి సవాళ్లతో GHMC కృషి చేస్తుంది.
శాశ్వత ట్రాక్‌లు నిర్మించబడే కొన్ని ప్రదేశాల్లో హబ్సిగూడ(habsiguda) క్రాస్‌రోడ్ నుంచి ఉప్పల్ క్రాస్‌రోడ్ వరకు 3 కి.మీ ట్రాక్, బైరామల్‌గూడ క్రాస్‌రోడ్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు నాలుగు కిలోమీటర్ల ట్రాక్, ఆరామ్‌ఘర్ నుంచి ఒవైసీ జంక్షన్(oyc junction) వరకు మరో నాలుగు కిలోమీటర్ల ట్రాక్ లు దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిపారు. సైకిల్ ట్రాక్‌లతో పాటు పలుచోట్ల పేవ్మెంట్లు నిర్మించి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.
రాబోయే సైకిల్ ట్రాక్‌లు
హబ్సిగూడ జంక్షన్ నుంచ్ ఉప్పల్ జంక్షన్ వరకు (3-కిమీ)
బైరమల్ గూడ కూడలి నుంచి ఒవైసీ జంక్షన్ వరకు (4-కిమీ)
ఆరామ్‌ఘర్ నుంచి ఒవైసీ జంక్షన్ (4 కి.మీ.)
KBR పార్క్ వద్ద తాత్కాలిక ట్రాక్ (6 కిమీ)
IKEA నుంచి రాయదుర్గ్ (6 కి.మీ) వరకు
IDL లేక్ నుంచి JNTU వరకు, రెయిన్బో విస్టా నుంచి IDL లేక్ వరకు (10-కిమీ)
ఖాజాగూడ నుంచి నానక్ రామ్‌గూడ (2.25-కిమీ)
రోలింగ్ హిల్స్ నుంచి AIG హాస్పిటల్స్ వరకు (450-మీటర్లు)
బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి లెదర్ పార్క్ వరకు (2-కిమీ)