హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి(NH-65) పైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో జాతీయ రహదారి(National Highway)పై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వాహనాలు బారులుతీరాయి. కొందరు వాహనదారులు (Motorists) వరదనీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
కంచికచర్ల (Kanchikacharla) మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి.భారీ వర్షాలకు హైదరాబాద్ (Hyderabad) నగరం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ(Vijayawada)-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. భారీగా పోటెత్తుతున్న వరదతో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి