జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి(Moranchapalli)లో చిరదల్లో చిక్కుకున్న 70 మందిని సురక్షితంగా రక్షించమని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ డీజీ నాగిరెడ్డి తెలిపారు. గ్రామాన్ని ఖాళీ చేయించినట్లు ఆయన చెప్పారు. వరంగల్ (Warangal) పట్టణంలో సైతం బోట్ల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. .వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను రెండు హెలికాప్టర్లు(Helicopters),6 బోట్ల సాయంతో రక్షించామని ఆయన తెలిపారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇసుక క్వారీలో చిక్కుకున్న వారిని కాపాడామన్నారు.భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నాగిరెడ్డి వెల్లడించారు.
భారీ వర్షాలు(Heavy rains), వరదల కారణంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా డయల్ 100, 101కు కాల్ చేసి సమాచారం అందించాలని డీజీ నాగిరెడ్డి (DG Nagireddy) సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి నీళ్ల వద్దకు ఎవరూ వెళ్లొద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకి రావొద్దని సూచించారు. శుక్రవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీ తెలిపారు.వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను రెండు హెలికాప్టర్లు, 6 బోట్ల సాయంతో రక్షించారు. సకాలంలో రెస్క్యూ సిబ్బంది (Rescue personnel) రక్షణ చర్యలు చేపట్టడంతో గ్రామస్థుల ప్రాణాలతో బయటపడ్డారు. ఇక వరద ఉధృతి నేపథ్యంలో అంతకు ముందే గ్రామస్థులందరినీ ఖాళీ చేయించారు.