కడప: వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యపల్లి సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి వేంపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.