సత్యసాయి: ధర్మవరం కొత్తపేటలో ఇవాళ సాయంత్రం వ్యక్తి దారుణ హత్యకు గురవడంతో కలకలం రేగింది. ప్రైవేట్ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడు కొత్తపేటకు చెందినవాడని గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.