TG: మహబూబాబాద్ జిల్లా గంగారంలో అడవి పంది దాడి కలకలం రేపింది. అందులగూడెం గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా.. పంది దాడి చేసి గాయపరిచింది. అతడు కేకలు వేయడంతో సమీప రైతులు వచ్చి పందిని తరిమేశారు. గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో రైతులు, స్థానికులు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు.