ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మర్రా పర్వతాల ప్రాంతంలోని ఓ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 1000 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సూడాన్ లిబరేషన్ ఆర్మీ ధ్రువీకరించింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.