»Do You Know How Many Thousands Of Crores Are Lost Annually Due To Traffic In Bengaluru
Traffic: ట్రాఫిక్ మూలంగా రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల నష్టమంటే!
బెంగళూరులో ట్రాఫిక్ మూలంగా ఏడాదికి వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని డీకే శివకుమార్ కలిశారు. హైదరాబాద్ కూడా ఈ సమస్యకు అతి చేరువలో ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Do you know how many thousands of crores are lost annually due to traffic in Bengaluru?
Bengaluru: దేశంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మెట్రో రైల్లు వేసినా, ఫ్లై ఓవర్లు నిర్మించినా ఈ రద్ది మాత్రం తగ్గట్లేదు. సమస్యను తగ్గేంచడం కోసం నేషనల్ స్థాయిలో కొన్ని కమిటీలు పని చేస్తున్నప్పటికీ పరిష్కారం మార్గాలు ఇంకా కనిపించడం లేదు. ట్రాఫిక్ సమస్యల వలన కాలుష్యంతో పాటు ఏట పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం కూడా జరగుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే దేశ ఐటీ నగరం బెంగళూరు(Bengaluru ) అంటే అందరికి గుర్తుకొచ్చిది ట్రాఫిక్(Traffic). దీని తరువాత అక్కడ లివింగ్ ఖర్చులు, సాఫ్ట్వేర్ కంపెనీలు. నగరంలో గమ్యస్థానాలకు చేరాలంటే కొన్నిగంటలు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిపై నెటిజన్లు రకరకాలుగా సోషల్ మీడియాలో స్పందించడం చూస్తూనే ఉంటాం. ఇలా సిగ్నళ్ల వద్ద వేచి ఉండడం వలన ఇంధనం వృథా కావడంతో పాటు నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోందని ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి, ఆయన బృందం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలను పరిశీలించిన తరువాతే ఈ విషయాన్ని తెలిపింది.
నగరంలో 60 ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ బెంగళూరు(Bengaluru)కు ఏటా దాదాపు రూ.20 వేలకోట్ల రూపాయల భారీ నష్టం వస్తుందని వివరించింది. అయితే ఇక్కడ ఐటీ రంగంలో చాలా అభివృద్ధి జరుగుతుందని అందుకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఐటీ రంగంలో కొలువుల కోసం, కోచింగ్‌ల కోసం వస్తున్నారని, దాని మూలంగా ఇతర సదుపాయాలు మెరుగవుతున్నాయని తెలిపింది. అయితే పెరుగుతున్న జనభాకు తగ్గట్టుగా వాహనాల సంఖ్య కూడా 1.5 వరకు ఉంది. దానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ లేదని నిపుణుల బృందం తెలిపింది. అలాగే పెరుగుతున్న జనభాకు తగ్గట్టుగా సదుపాయాలాను ఏర్పాటు చేయాలని అప్పుడే ఈ సమస్య నుంచి బయట పడుతామని తెలిపారు. ఇదే విషయమై కర్ణాటక ఉప్ప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటివల కేంద్రమంత్రి నితన్ గడ్కరీని కలిశారు. ఆ సమస్యలను తొలగించెందుకు మార్గాల నివేదికను సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీహరి బృందం ట్రాఫిక్ నిర్వహణ రోడ్డు ప్లానింగ్‌పై శివకుమార్‌కు నివేదిక ఇచ్చింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్(Hyderabad)లో కూడా ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికే వర్షాలు వచ్చినప్పుడు కిలోమీటర్ల మేర రోడ్లన్ని స్తంభించపోతున్నాయి. ఇక రద్దీ ఎక్కవుగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో కూడా ఈ సమస్యలు అధికం అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే భాగ్యనగరం బెంగళూరును దాటిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.