»Bhumana Belongs To Christian How His Take Ttd Chairman Post
Bhumana: అన్యమతస్తుడికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు..? కరుణాకర్ నియామకంపై వివాదం
టీటీడీ చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అని.. ఆయనను చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు, భక్తులు కోరుతున్నారు.
Bhumana Belongs To Christian How His Take TTD Chairman Post
Bhumana Karunakar Reddy: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం పాలకమండలి చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) జగన్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. భూమనకు (Bhumana) పోస్ట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ఎందుకంటే ఆయన హిందుమతానికి చెందినవారు కాదని తెలుస్తోంది. ఆయన కూతురి వివాహాం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది. దీంతో భూమన హిందువు కాదని విపక్షాలు, నెటిజన్లు అంటున్నారు. తిరుమల దేవస్థానం పవిత్రత, భక్తుల మనోభావాలను జగన్ సర్కార్ ఎందుకు గాలికొదిలేసిందని ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ హాజరు
భూమన (Bhumana) కూతురి వివాహానికి సీఎం జగన్ కూడా హాజరయ్యారు. ఆ కొత్త జంటను ఆశీర్వదించారు. ఆ పిక్ ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ప్రపంచంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రం తిరుమల. ఇక్కడికి నిత్యం వేలల్లో భక్తులు వస్తుంటారు. పర్వదినాల రోజున అయితే చెప్పక్కర్లేదు. ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణ రోజుల్లోనే సర్వ దర్శనానికి కనీసం 10 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక శ్రావణం, కార్తీక మాసం, బ్రహ్మోత్సవాలు.. వేసవి కాలంలో అయితే చెప్పక్కర్లేదు. కోట్లాది మంది భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని (sri varu) మంచి మనస్సుతో, నిష్టగా కొలుస్తారు. ఆరాధ్య దైవాన్ని దర్శించుకొని ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటారు.
క్రిస్టియన్‌కు పదవీ..?
ప్రతిష్టాత్మక టీడీపీ చైర్మన్ పదవీని క్రిస్టియన్‌కు ఇవ్వడంతో వివాదం చెలరేగింది. ఏపీ సర్కార్ తీరును మాఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. భక్తులు కూడా తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. భూమన కరుణాకర్ (Bhumana) తప్ప మరెవరు లేరా..? హిందూ నేతలు కనిపించడం లేదా అని అడుగుతున్నారు. ఎందుకు తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇది సరికాదని.. భూమనను (Bhumana) టీటీడీ చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని కోరుతున్నారు. నిత్యం ఆ దేవ దేవుడిని దర్శించుకునేందుకు వస్తుంటామని.. అలాంటి చోట, ఆలయ పాలనా వ్యవహారాలను ఓ అన్యమతస్తుడి చేతిలో ఎలా పెడతారని వారి వాదన.
వైవీ కూడా
భూమన (Bhumana) కన్నా ముందు కొనసాగిన వైవీ సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ అనే వాదనలు వినిపించాయి. ఆ వివాదం తేలిగ్గానే సద్దుమణిగింది. భూమనకు (Bhumana) సంబంధించి ఫోటోలు బయటకు రావడంతో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను పదవీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భూమనకు (Bhumana) వైఎస్ఆర్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. వివిధ సమస్యలపై ఉద్యమం చేస్తూ జైలుకు వెళ్లాడట. అక్కడ వైఎస్ రాజారెడ్డితో పరిచయం ఏర్పడింది. తర్వాత అతని కుమారుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా మెలిగాడు. వైఎస్ఆర్ (ysr) చేపట్టిన పాదయాత్రను భూమన దగ్గరుండి పర్యవేక్షించారు. 2009లో తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి (chiranjeevi) చేతిలో ఓడిపోయారు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత 2004 నుంచి 2006 వరకు తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
File Picture : Bhumana Karunakar Reddy daughter's marriage attended by current CM YS Jagan pic.twitter.com/us6doN4oy7
వైసీపీలో చేరి, జగన్‌కు అండగా నిలిచి
వైఎస్ఆర్ (ysr) చనిపోయిన తర్వాత జగన్‌తో వైసీపీలో చేరారు. 2012లో జరిగిన బై పోల్‌లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లో మాత్రం ఓడిపోయారు. 2019లో ఇక్కడినుంచే పోటీ చేసి గెలుపొందారు. 2021లో టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. తర్వాత ఈ నెల 5వ తేదీన టీటీడీ చైర్మన్‌గా ఏపీ సర్కార్ నియమించింది. దీంతో దుమారం చెలరేగింది. గతంలో పదవీ చేపట్టినప్పటికీ.. అతను క్రిస్టియన్ అని భక్తులు అంటున్నారు. అతనికి ఆ పదవీ సరికాదు అని.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.